మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (07:35 IST)

తిరుమలలో గదుల బుకింగ్ కు కొత్త నిబంధనలు

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంత కష్టపడాలో.. అక్కడ రూంలు లభించడం కూడా అంతే కష్టం. రూంల బుకింగ్ కు ఇప్పటి వరకు ఎలా ఉన్నా…ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చింది టీటీడీ.

క్యాష్ ఆన్ డిపాజిట్ విధానం అమలు చేయనున్నామని.. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా ఆన్ లైన్ ద్వారా రూమ్ ను బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుంది.

ఎంత మొత్తం ధరను నిర్ణయించిన గదిని అద్దెకు తీసుకుంటే, అంతే మొత్తంలో ముందుగానే టీటీడీ ఖాతాకు డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పింది.

అయితే గదిని ఖాళీ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలిపింది. కొత్త విధానం ఈ నెలాఖరు నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది టీటీడీ.