Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవిశ్వాసంపై చర్చ ఖాయమా? టీఆర్ఎస్ ఏమంది? ఎంపీలు రాజీనామా చేస్తారా?

మంగళవారం, 27 మార్చి 2018 (07:39 IST)

Widgets Magazine
modi - shah

అవిశ్వాసంపై పార్లమెంట్‌లో జరిగేలా సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీల నిరసనలు, వైకాపా, టీడీపీ పార్టీల అవిశ్వాస నోటీసులు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే అవిశ్వాసంపై చర్చ జరగకుండా బీజేపీ సర్కారు వాయిదాల పర్వం కొనసాగిస్తుంది. 
 
ఇంకా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టి నినాదాలు చేయిస్తూ.. అవిశ్వాసంపై చర్చ జరగకుండా వ్యూహం వేసిందని బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ అవిశ్వాసంపై చర్చకు సిద్ధమవుతోంది. మరోవైపు అవిశ్వాసంపై మంగళవారం చర్చ జరగని పక్షంలో తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని వైకాపా చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
ఇదిలా ఉంటే.. కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు తమ వల్ల ఆటంకం కలిగే పరిస్థితి రానివ్వమని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం నిమిత్తం తమ పార్టీ ఎంపీలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలని కోరడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నామన్నారు. 
 
వారం రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం ప్రభుత్వంలో కదలిక లేదని విమర్శించారు. తాము చేస్తున్న ఆందోళనను సాకుగా తీసుకుని, లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ వాయిదా వేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అవిశ్వాసంపై చర్చ జరిగితే తమ డిమాండ్లను ప్రస్తావించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు అన్నాడీఎంకే ఎంపీలకు ఎన్డీయే సర్కారు నచ్చజెప్పి.. అవిశ్వాసంపై చర్చ జరిగే దిశగా రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో మంగళవారం అవిశ్వాసంపై చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీ 'హోదా' ఎఫెక్ట్ కర్నాటకలో రిఫ్లెక్ట్ కాబోతుందా? భాజపాపై తెలుగువారు...?

కర్నాటక రాష్ట్రంలోని 30 జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో తెలుగువారి ప్రభావం విపరీతం అని ...

news

పవన్ కళ్యాణ్ గందరగోళం సృష్టిస్తున్నారు... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడకొట్టి రెండు రాష్ట్రాలకు కొన్ని ...

news

బీజేపీతో టీడీపీ రాజీ పడింది.. జేడీ లక్ష్మీ నారాయణ వస్తే ఆహ్వానిస్తాం: పవన్

తెలుగుదేశం పార్టీకి జనసేనాని పవన్ కల్యాణ్ కాస్త దూరమైనట్లే కనిపిస్తోంది. జనసేన పార్టీ ...

news

తప్పుడు వార్తలు రాశారో.. పదేళ్ల జైలు శిక్ష తప్పదండోయ్..

మీడియా సంస్థలు, ఆన్‌లైన్ వెబ్ సైట్లు రేటింగ్ కోసం వార్తలను ముందుగా ప్రచురించేందుకు ...

Widgets Magazine