మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (15:10 IST)

రాజధాని తరలింపు ఖాయం.. నాన్ పొలిటికల్ జేఏసీతో హోం మంత్రి

ఏపీ హోం మంత్రి సుచరితని నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు సోమవారం గుంటూరులో కలిశారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ, మూడు పంటలు పండే భూములలో రాజధాని సాధ్యం కాదని హోంమంత్రి చెప్పారు. 
 
అమరావతి అభివృద్ధికి వేల కోట్లు కావాలని, అంత ఖర్చు చేసే పరిస్థితి ఇప్పుడు లేదని, ఉద్యమాలు చేసే వారు కూడా ఆలోచించాలన్నారు. మొత్తం రాజధానిని తరలించడం లేదుకదా.. అన్ని ప్రాంతాలకు వికేంద్రికరణ చేస్తే మంచిదేగా అని సుచరిత సమాదాన మిచ్చారు. 
 
హోంమంత్రి వ్యాఖ్యాలపై స్పందించిన జేఏసీ అధ్యక్షుడు మల్లికార్జున రావు మాట్లాడుతూ.. అమరావతి ఏర్పాటు సమయంలోనే ఎందుకు వైసీపీ పార్టీ అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. 13 జిల్లాలకు కేంద్ర స్థానంలోనే అమరావతి రాజధానిగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీరు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.