సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్

బుధవారం, 4 అక్టోబరు 2017 (19:54 IST)

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఒక ప్రధాన సమాచార కమిషనర్, ముగ్గురు రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి  ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సమాచార హక్కు చట్టం-2005లోని 15,16 సెక్షన్లతో తెలిపిన విధంగా తమ దరఖాస్తులు అందజేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి ఒక ప్రకటనలో తెలిపారు. 
 
దరఖాస్తులను వ్యక్తిగతంగా గానీ, రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ ఏపీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, 4వ అంతస్తు, డీపీఎస్ కన్‌స్ట్రక్షన్స్, సాయిబాబా గుడి ఎదురు, జాతీయ రహదారి అనుబంధ సర్వీస్ రోడ్, మంగళగిరి-522503, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ(20-10-2017) సాయంత్రం 5 గంటల లోపల అందజేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మీకు దండం పెడతా.. నన్ను రోడ్డుపైకి లాగొద్దండీ... కమల్ వేడుకోలు

నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా.. అయితే కొద్దిగా టైం పడుతుంది. అంతవరకు నన్ను ...

news

తమిళనాడు సిఎంకు తిరుమలలో అవమానం... బాబుకు చెపుతాం...

తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామికి తిరుమలలో తీవ్ర అవమానం జరిగింది. శ్రీవారి దర్శనార్థం ...

news

గుర్మీత్ నాకు తండ్రిలాంటివాడు.. చెడు సంబంధం అంటగట్టొద్దు : హనీప్రీత్

డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తనకు తండ్రిలాంటివాడని, ఆయనతో తనకు చెడు సంబంధం ...

news

పది సూట్‌కేసుల్లో 23 గన్స్‌ను హోటల్‌కు చేరవేసిన పెడ్డాక్

అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నరమేధానికి పాల్పడిన స్టీఫెన్ పెడ్డాక్‌ గురించి అనేక ...