Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు : స్పీకర్ శివప్రసాదరావు

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (14:04 IST)

Widgets Magazine

అమరావతి :ఈ నెల 30వ తేదీ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాధిపతి డా.కోడెల శివప్రసాదరావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. 
Durga
 
ఈమేరకు ఆయన కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగ సందర్భంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భక్తులు చేసిన ప్రార్థనలు లోక కళ్యాణానికి, సుఖశాంతులకు ఆలవాలం అవుతాయని ఆయన పేర్కొన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సిరిసంపదలు కలగాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుండాలని దుర్గామాతను వేడుకుంటున్నట్టు స్వీకర్ పేర్కొన్నారు.
 
అదేవిధంగా దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా స్వీకర్ పేర్కొన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా కనకదుర్గ మాత ఆశీస్సులు తెలుగువారందరికీ లభించాలని అన్ని వర్గాల ప్రజలకు ఈ సంవత్సరంలో విజయాలు చేకూరాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నట్టు స్వీకర్ శివప్రసాద రావు ఆ ప్రకటనలో తెలియజేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Navratri 2017 Andhrapradesh Assembly Speaker Mahanavami Wishes Telugu People

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

మంగళవారం తలస్నానం చేస్తే...

సాధారణంగా మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు మాత్రం వారానికి ...

news

తిరుమలలో అపశృతి-మాడ వీధుల్లో ఏనుగు ఏం చేసిందంటే..?

తిరుమల శ్రీవారి గరుడ వాహనసేవలో అపశృతి చోటుచేసుకుంది. వాహనసేవలో వెళుతున్న గజరాజు ...

news

ముత్యాల పందిరిలో చూడముచ్చటగా ఊరేగిన మలయప్ప స్వామి.. (Video)

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమల కొండలపై వైభవంగా జరుగుతున్నాయి. ...

news

క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు దాండియా నృత్య నీరాజ‌నం... 300 మంది గుజ‌రాతీ మ‌హిళ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌

విజ‌య‌వాడ‌: న‌వ‌రాత్రి వేడుక‌ల నేప‌ధ్యంలో క‌న‌క‌దుర్గ‌మ్మకు నృత్య‌ నీరాజ‌నం ...

Widgets Magazine