నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలంటే?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:40 IST)

నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలో దేవి భాగవతంలో చెప్పబడింది. జగజ్జనని అయిన ఆ తల్లిని పూజిస్తే ఇహంలో భోగ భాగ్యములను, పరంలో ముక్తినీ ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. విజయదశమి రోజున త్రిశక్తి రూపిణి అయిన అమ్మవారు మహిషాసురునితో తొమ్మిది రోజులు భీకర యుద్ధం చేసి విజయదశమి రోజే హతమార్చింది. 
 
శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపింది కూడా ఈరోజే. శమీవృక్షంపై ఉన్న అస్త్రాలను అర్జునుడు పూజించి ఉత్తర గోగ్రహణంలో కౌరవులపై గెలిచింది కూడా ఈ రోజే. అందుకే నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారిని రోజుకో అలంకారంలో చూస్తుంటాం. 
 
నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే వాటిని దేవీనవరాత్రులు అని పిలువబడుతున్నాయి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖం గాని కూర్చోవాలి. 
 
గురువును స్తుతించి.. గాయత్రీ మంత్రం జపించిన తర్వాత మహాసంకల్పం చెప్పాలి. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయాలి. విఘ్నేశ్వర పూజ చేయాలి. ఆపై తొమ్మిది రోజుల పాటు బ్రాహ్మణులను గౌరవించాలి. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబవళ్ళు వెలగాలి. ఇలా తొమ్మిది రోజుల పాటు పూజ చేసేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.దీనిపై మరింత చదవండి :  
Navratri 2017 Day 1 Ghatasthapana Puja Timings Tithi Vidhi Nine Days Lord Rama Godess Durga

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

నవరాత్రుల్లో ఎనిమిదో రోజు.. సరస్వతీ పూజ.. సంధి కాలం అంటే?(వీడియో)

నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సరస్వతీ పూజ, దుర్గాష్టమి, మహాగౌరీ పూజ, సంధి పూజ చేసుకోవచ్చు. ...

news

భార్య సాయంత్రం ఇలా చేస్తే దేవుడు కూడా కాపాడలేడట...

మనం చేసే పనే మనలో ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుందట. ఇంట్లో ఆడవారు చేసే పనులో కష్టాలను ...

news

విళంబి నామసంవత్సరం.. ఏ పండుగ.. ఏ తేదీలో...

తెలుగు కొత్త సంవత్సరం విళంబి నామ సంవత్సరంలో వచ్చే పండుగ తేదీలపై వివాదం నెలకొనివుంది. ...

news

నవరాత్రుల్లో ఏడవరోజు.. కాళరాత్రిని పూజిస్తే..(వీడియో)

నవరాత్రుల్లో ఏడవ రోజున (సెప్టెంబర్ 27) కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ...