నవరాత్రుల్లో నాలుగో రోజు.. కూష్మాండ అవతారంలో అమ్మవారు(వీడియో)

శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (19:38 IST)

నవరాత్రుల్లో నాలుగో రోజున (సెప్టెంబర్ 24) కూష్మాండ అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఈమె సూర్యుడిలో దాగి ప్రపంచాన్ని వెలుగునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి లభిస్తుంది. ధైర్యం సిద్ధిస్తుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. దేవీ సింహంపై ఆశీనురాలై వుంటుంది. ఎనిమిది చేతులను కలిగివుంటుంది కనుకనే ఈ మాతను అష్టభుజదేవి అని పిలుస్తారు. ఆమె చేతిలోని జపమాల ద్వారా ప్రపంచంలోని ప్రజలకు సిద్ధి, నిధిని ప్రసాదిస్తుంది. 
Kushmanda devi
 
అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు. ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. భౌమ చతుర్థిని ఆచరించి కూష్మాండ శక్తి రూపాన్ని ఎర్ర రంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున చతుర్థి తిథి. లలితా దేవి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ఉపవాసముండి, పండ్లు పాలు తీసుకుని, ఒంటి పూట ఆహారం తీసుకుని.. లలితాదేవి పూజించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇంకా ఈ మంత్రంతో కూష్మాండ మాతను స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయి. 
"సురా సంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవ చ 
దధాన హస్త పద్మాభ్యం కుష్మాండా శుభదాస్తుమ్."దీనిపై మరింత చదవండి :  
Navratri 2017 Dussehra 2017 Kushmanda Devi And Mantra

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

దేవీ నవరాత్రి 3వ రోజు... చంద్రఘంట దేవీ పూజ ఎలా చేయాలి?(వీడియో)

నవరాత్రుల్లో మూడో రోజైన సెప్టెంబర్ 23వ తేదీన సింధూర్ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ...

news

నవరాత్రి 2వ రోజు... బ్రహ్మచారిణీ అవతారం... అమ్మవారికి మల్లెలంటే ఇష్టం(వీడియో)

నవరాత్రుల రెండవ రోజు (సెప్టెంబర్ 22) బ్రహ్మచారిణీ మాతని నిష్ఠతో ఆరాధిస్తారు. ఈ మాత ...

news

మీ దుఃఖానికి మీరే కారణం.. ఇతరులు కానేకాదు.. సద్గురు

ప్రజలు బాధల్లో ఉండడానికి కారణం జీవితాన్ని అపార్ధం చేసుకోవడమే. దుఃఖానికి ఇతరులు కారణమని ...

news

నవరాత్రి ఒకటవ రోజు....శైలిపుత్రిగా అమ్మవారు... ఎలా పూజించాలి?(వీడియో)

నవరాత్రి, దసరాతో పదిరోజుల పండుగ మనముందుకు వచ్చేస్తోంది. ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీ నుంచి ...