శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి

నవరాత్రులు 2020: చంద్రఘంటా దేవిని సోమవారం పూజిస్తే..?

Chandraganta Devi
అక్టోబరు 17 నుంచి శరన్నవరాత్రులు మొదలయ్యాయి. రెండో రోజైన అక్టోబరు 18, చంద్ర దర్శన, బ్రహ్మచారిణి పూజ చేయాలి. అలాగే మూడో రోజైన సోమవారం (అక్టోబరు-19) సింధూర పూజ, చంద్రఘంటా పూజ చేయడం ద్వారా ఈతిబాధలుండవు. 
 
రెండో రోజు.. అమ్మవారు బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు. మూడో రోజు.. చంద్రఘంటా అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పించుకుంటారు. ఆది శక్తి నవరాత్రుల్లో మూడో రోజు చంద్రఘంటా దేవి అవతారంలో పూజలు అందుకుంటుంది. 
 
పార్వతీ దేవీ పరమేశ్వరునికి ధర్మపత్ని. వివాహం తర్వాత చంద్రుడు చేసిన నెలవంకను శిరస్సులో ధరిస్తాడు.ఈ కారణంగానే ఆమెను చంద్రఘంటా అని పిలుస్తారు. ఆమెను పూజించడం ద్వారా మానవ జీవితంలో సమస్యలు వుండవు. ఆమె పది చేతులు, మూడు కళ్ళు కలిగి ఉంటుంది. ఆమె నుదిటిపై శివుడి నెలవంక చంద్రుడు ఉంది. 
 
ఆమె బంగారు రంగు కలిగి యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. ఆమె గంటలను మాలగా ధరిస్తుంది. ఇది రాక్షసులను భయపెడుతుంది అమ్మవారి గంటల శబ్ధం రాక్షసులను భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె పులిని నడుపుతూ తన భక్తులను రక్షిస్తుంది. ఆమెకు నచ్చిన పుష్పం కమలం. నచ్చిన రంగు ఎరుపు. అలాగే ''ఓం దేవి చంద్రఘంటాయై నమః'' అనే మంత్రాన్ని స్తుతించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా చంద్ర, శుక్ర గ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
సుఖశాంతులను ప్రసాదించే ఆమె తలపై సగం చంద్రునితో అలంకృతమై వుంటుంది. ఆమెను నవరాత్రుల్లో మూడో రోజున పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి. సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి. పాలు ఇంకా పాల ఉత్పత్తులతో తయారయ్యే ఆహార పదార్థాలను ఆమెకు నైవేద్యంగా సమర్పించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తృతీయ తిథి, సోమవారం పూట నవరాత్రుల్లో భాగమైన మూడో రోజు రావడంతో శివునిని కూడా ఆ రోజు పూజించిన వారిక సకలసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.