బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 2 జులై 2020 (16:39 IST)

పేద విద్యార్థులకు బరువైన ఆన్లైన్ విద్య

జూలై నెల అడుగు పెట్టినప్పటికీ ఈ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చడం మరోవైపు సడలింపుతో లాక్‌డౌన్ కొనసాగడం జరుగుతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు ఆన్లైన్ విద్య పేరిట కాసులు దండుకుంటున్నాయి.
 
లాక్‌డౌన్ నేపధ్యంలో జీవో నెం 46 ప్రకారం రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ స్పష్టనైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజులు పెంచరాదని, ట్యూషన్ ఫీజులు మాత్రము వసూలు చేయాలని అది కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో వసూలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను నొప్పించరాదని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆన్‌లైన్ విద్య విద్యార్థులకు బరువుగా మారింది.