శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 12 ఆగస్టు 2021 (12:09 IST)

మా వెంకయ్య మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి: సోమిరెడ్డి

ఉపరాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న శ్రీ వెంకయ్య నాయుడు గారికి తెదేపా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా తెలుపుతూ.. సింహపురి నుంచి హస్తినాపురి వరకు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం వెంకయ్య అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... అమ్మభాష పరిరక్షణకు అవిశ్రాంత పోరాటం.. ప్రజాస్వామ్య బలోపేతానికి నిరంతర కృషి.. కరోనా సంక్షోభ సమయంలో జాతిని ఉత్తేజం చేసేందుకు ప్రత్యేక ప్రయత్నాలతో భారతమాత ముద్దుబిడ్డగా నాలుగేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న గౌరవ ఉపరాష్ట్రపతి, పూజ్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
 
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా పెద్దాయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని మనసారా కోరుకుంటున్నాను అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.