ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (09:17 IST)

పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్పు

పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కలెక్టర్ల వినతి మేరకు... ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న 20 మండలాలకుగాను 15 మండలాల్లో తొలి దశలో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు.

ఒంగోలు డివిజన్‌లో మిగిలిన 5 మండలయిన కొరిశపాడు, జె.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13 న రెండో దశలో ఎన్నికలను నిర్వహించనున్నామని ఎస్‌ఈసీ ప్రకటించింది.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో 3 వ దశకు బదులు ఫిబ్రవరి 13 న రెండోదశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకుగాను ఎన్నికల తేదీల్లో మార్పులు చేశారు.

లింగపాలెం, జె.నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట మండలాల్లో 4 వ దశకు బదులు ఫిబ్రవరి 17 న 3 వ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.