మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 21 జనవరి 2021 (19:01 IST)

వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం: రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ

స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం... వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
 
ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించారు. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
 
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్. ఆలయ మర్యాదలతో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.