ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జులై 2024 (20:30 IST)

జగన్‌ను ఆ విషయంలో ఫాలో అవుతున్న పవన్.. ఏంటది?

Pawan kalyan
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు కట్టుబడి ఉన్నామని మరోసారి ఉద్ఘాటించారు. ఖజానా ఖాళీ కావడంతో సచివాలయానికి హాజరైన 3-4 రోజుల జీతం తీసుకోవడానికి నిరాకరించారు. తన క్యాంపు కార్యాలయానికి మరమ్మతులు చేయడం లేదా దాని కోసం కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయడం మానేశారు.
 
సచివాలయ సిబ్బంది తన కార్యాలయాన్ని ఎలా బాగు చేస్తారని అడగ్గా, పవన్ ఏమీ చేయనవసరం లేదని, తన కార్యాలయానికి సొంతంగా ఫర్నీచర్ తెచ్చుకుంటానని చెప్పారు. అదే సమయంలో గ్రామాల్లోని ప్రాథమిక సమస్యలను పరిష్కరించకుండా గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌కు భారీగా ఖర్చు పెట్టిందని ఫైర్ అయ్యారు. 
 
అయితే జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా పనిచేసే ఆలోచన.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పవన్ ఎంచుకుని ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. ఒకే ఒక్క రూపాయి మాత్రమే నెలకు తీసుకుంటానని జగన్మోహన్ రెడ్డి గత పాలనలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.