1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 1 ఫిబ్రవరి 2020 (19:53 IST)

రాపాక పార్టీలో వున్నారో లేదో తెలియదు... పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

బెజవాడ ఈస్ట్, నరసాపురం కార్యకర్తలతో భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇస్తే రాష్ట్రం కుదేలైంది అని అన్నారు. వేరే పార్టీకి ఓటేశారని రేషన్ కార్డులు, ఇళ్ళపట్టాలు ఇవ్వని పరిస్థితులు వచ్చాయి.
 
ప్రభుత్వం అంటే ప్రజలందరి కోసం పనిచేయాలి కానీ కొందరు కోసం కాదు అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొడట్టం తేలికే కానీ కలపటం కష్టం అన్నారు. పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థలే అవకాశం అని పార్టీ నేతలు అందరూ దీనిపై దృష్టి పెట్టాలి అన్నారు. ఒక్కఛాన్స్ పార్టీలా కాకుండా ఛాన్స్ ఇవ్వకపోయినా ప్రజలకు అండగా ఉండాలి అన్నారు.
 
పార్టీలో ఎవరైనా ఇష్టం ఉంటేనే ఉండాలి బలవంతంగా కాదు. పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదు. కాపాల కాసే రాజకీయాలు తాను చేయను అన్నారు. పార్టీకి రాజీనామా చేసి వెళ్తూ నాపై విమర్శలు చేస్తున్నారు.
 
విమర్శలు చేసే వారు వెయ్యి రూపాయలు సమాజం కోసం వదులుకోగలరా అని ప్రశ్నంచుకోవాలి అన్నారు. నాపై ఆధారపడ్డ వారిని, కుటుంబం కోసమే నిమాలు చేస్తున్నా, వేల కోట్ల ఆస్తి, నెలకో కోటి రూపాయలు ఆదాయం వస్తే సినిమాలు చేసే వాడిని కాదు అన్నారు.