తెలంగాణాలో ఎవరికి మద్దతిద్దాం?. జనసైనికులను అడిగిన పవన్

pawan
Last Updated: మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:21 IST)
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అలాగే, జనసేన ఎవరికి మద్దతిస్తుందోనన్న ఆసక్తి కూడా తెలంగాణ ప్రజల్లో నెలకొంది.

ఈ నేపథ్యంలో జనసేన మద్దతుపై ఈనెల 5వ తేదీన ఓ క్లారిటీ రానుంది. 'తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతోపాటు పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియచెయ్యమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తారీఖున తెలియ పరుస్తాం. అయితే, ఎవరికి మద్దతివ్వాలో జనసైనికులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరుతున్నాం' అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న ముందుస్తు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయడం లేదు. నిర్ణీత గడువుకంటే ముందుగా జరుగుతున్నందున పోటీకి దూరంగా ఉండాలని భావించింది. కానీ, 2019 మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :