ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (12:08 IST)

నా కర్మ! ఒకే పెళ్ళి కుదరలేదు... నేనేం చేయను.. ఒళ్లు కొవ్వెక్కి చేసుకోలేదు : పవన్

తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ధీటుగా సమాధానం ఇచ్చారు. నా కర్మ.. ఒకే పెళ్లి కుదరలేదు. నేనేం చేయను. పొగరెక్కి పెళ్లిళ్

తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ధీటుగా సమాధానం ఇచ్చారు. నా కర్మ.. ఒకే పెళ్లి కుదరలేదు. నేనేం చేయను. పొగరెక్కి పెళ్లిళ్లు చేసుకోలేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.
 
ఇటీవల జగన్ మాట్లాడుతూ, 'కార్లు మార్చినట్లు పెళ్లిళ్లు చేసుకున్నారు' అంటూ కొన్నాళ్ల క్రితం జగన్‌ చేసిన విమర్శలపై తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు తాడేపల్లిగూడెంలో 'జనపోరాట యాత్ర' సభల్లో పవన్‌ ప్రసంగించారు. టీడీపీ, వైసీపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
'జగన్‌ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. నా జీవితంలో రహస్యాలంటూ ఏమీలేవు. పవన్‌కు మూడు పెళ్లిళ్లా అని దెప్పి పొడుస్తున్నారు. నా కర్మ! ఒకే పెళ్ళి కుదరలేదు. నేనేం చేయను! ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు పెళ్లిళ్లు! నేను మీలాగా బలాదూర్‌ను కాదు' అంటూ విరుచుకుపడ్డారు.