Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్‌వి పిల్ల చేష్టలా..? ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారా?

మంగళవారం, 3 అక్టోబరు 2017 (20:41 IST)

Widgets Magazine
pawan kalyan

సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో ఏది చేసినా చెల్లుబాటవుతుంటుంది. ఆట్టే పెద్దగా పట్టించుకోరు. కానీ రాజకీయాల ద్వారా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టేవారి విషయంలో మాత్రం జనం బాగా గమనిస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్ చూసినవారు పవన్ కళ్యాణ్ లో పిల్ల చేష్టలు ఇంకా వున్నాయా అనే కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం వుంది. 
 
ఐతే ఇప్పుడే ఆ ఎన్నికలపై జనసేన మాట్లాడటం పక్కనపెడితే ఆ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామంటూ ట్వీట్ చేయడంతో అంతా నొసలు ఎగరేశారు. ఎవరో ఏదో అనుకుంటూ, చర్చించుకుంటూ వుంటారు కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత త్వరగా తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనితో జనసేన ట్వీట్ పైన ట్వీట్ల మోత మోగింది. 
 
ఏమనుకున్నారో కానీ ఆ ట్వీటును డిలిట్ చేశారు. కానీ ట్వీట్ చూసిన జనం మాత్రం పవన్ పిల్ల చేష్టల్లాగా వున్నాయంటూ చెప్పుకుని కిసుక్కుమంటూ నవ్వుకుంటున్నారట. మరి పార్టీ ప్రకటన విషయంలో ఇకపై జనసేన జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రకటలు ఇస్తే బెటరేమో?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుమలలో దారుణం - పసిబిడ్డను చంపి బాత్‌రూంలో పడేశారు

ఆడ బిడ్డ పుట్టిందని కోపంతో తిరుమలలో చంటిబిడ్డను కర్కశంగా గొంతు నులిమి చంపేశారు ఎవరో కర్కశ ...

news

విషమించిన శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం... పెరోల్‌పై రానున్న చిన్నమ్మ

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత ...

news

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 9న మెగా సీడ్ పార్క్‌కు శంకుస్థాపన, 650 ఎకరాలు...

అమరావతి : రూ.670 కోట్లతో ప్రపంచ స్థాయి మెగా సీడ్ పార్క్‌ను కర్నూల్ జిల్లాలో ఏర్పాటు ...

news

జగన్ సీఎం కావాలి... ప్రత్యేక రొట్టెను అందుకున్న అనిల్ కుమార్ యాదవ్

మత సామరస్యానికి ప్రతీక అయిన రొట్టెల పండుగ నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గాలో ...

Widgets Magazine