శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (10:28 IST)

ప్రకాశంలో పవన్.. బోటు బాధితులను పరామర్శించిన జనసేనాని

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లాలో పవన్ దిగారు. ఒంగోలులో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లాలో పవన్ దిగారు. ఒంగోలులో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులు పరామర్శిస్తున్నారు. అంతకుముందు శుక్రవారం జనసేనాని విజయవాడలో పర్యటించారు.  
 
ఈ  సందర్భంగా విజయవాడలో నిర్వహించిన సభలో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీలో ముఖ్యంగా, విజయవాడలో సామాజిక వర్గాల మధ్యనున్న ఆధిపత్య పోరు గురించి పవన్ వ్యాఖ్యలు అదుర్స్ అనిపించాయి. ఈ క్రమంలో వంగవీటి గురించి పవన్ ప్రస్తావించారు. ఇకపై వంగవీటి గురించి మాట్లాడటాన్ని పక్కనబెట్టి.. విజయవాడ రాజకీయాల్లో మార్పు తేవాలన్నారు. 
 
నిరాయుధుడిగా వంగవీటి హత్య ఒక తప్పైతే.. ఆయన హత్యతో సంబంధం లేని కుటుంబాలెన్నో ఈ విషయంలో నలిగిపోయాయన్నారు. అందులో కమ్మ, కాపు రకాల వ్యక్తులున్నారు. హత్యల పర్యవసానం చాలా బాధను కలిగిస్తుందని పవన్ చెప్పారు.