గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (13:13 IST)

నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ రహస్య పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్. జగన్నాథపురంలోని నరసింహస్వామి ఆలయంలో ఆయన ఈ ప్రత్యేక పూజలు చేశారు.

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ రహస్య పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్. జగన్నాథపురంలోని నరసింహస్వామి ఆలయంలో ఆయన ఈ ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంట నుంచి 4.30 గంటల వరకు ఈ పూజలు చేసినట్టు సమాచారం. ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా వివిధ రకాల అభిషేకాలు, యాగాలు చేసినట్టు తెలుస్తోంది.
 
ఈ ప్రత్యేక పూజల వ్యవహారం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పవన్.. అసలు రహస్య పూజలు ఎందుకు చేశారన్న విషయం తెలియరాలేదు. పైగా, పవన్ కళ్యాణ్ వెంట ఇంకెవరైనా ఉన్నారా? లేక ఆయన ఒక్కరే పూజారులతో వెళ్లి చేశారా అన్నది తెలియాల్సివుంది. 
 
ఇదిలావుంటే, గతంలో ఇదే ఆలయంలో పవన్ కళ్యాణ్ తాంత్రిక పూజలు చేశారని.. సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ తాంత్రిక పూజల నిర్వహణపై అపుడు రాజకీయ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు అయితే, ప్రత్యేక చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించాయి కూడా.