Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా?: జగన్‌కు పవన్ సూటి ప్రశ్న

బుధవారం, 6 డిశెంబరు 2017 (16:37 IST)

Widgets Magazine
pawan kalyan

2007లో రాజకీయాల్లో వచ్చి వుంటే రాటుదేలిపోయివుండేవాడినని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఎదగడానికే ముందుకొచ్చిన మహావృక్షాల ముందు మోకరిల్లానని తెలిపారు. సంకల్పం వుంటే ఏదైనా సాధ్యమేనని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మంచి చేశారు. అవినీతి కూడా ఆయన పేరిట వుంది. అందుకే జగన్‌కు మద్దతివ్వలేదు. తండ్రి సీఎం అయిన కారణంగా కుమారుడు కూడా సీఎం కావాలనుకోవడం తప్పు. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా? అంటూ ప్రశ్నించారు. 
 
పాలకుడు అవినీతి పరుడైతే ఆ ప్రభావం ప్రజలపై పడుతుందన్నారు. రాజకీయంగా నిరూపించకోకముందే పదవులు ఆశించడం తప్పని జగన్‌ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. అన్నివేల కోట్ల అవినీతిని సమర్థిస్తే.. తాను కూడా అలానే తయారవుతానోనని భయమేసింది. అందుకే ఆయన్ని సమర్థించలేదని చెప్పారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా అంటూ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు లాంటి తండ్రి తనకు లేదని పవన్ అన్నారు. 
 
మెగాస్టార్, అన్నయ్య చిరంజీవి గురించి మాట్లాడుతూ.. పవన్ భావోద్వేగానికి గురైయ్యారు. మంచి చేయాలనే తపన వుండే చిరంజీవి లాంటి వ్యక్తి.. రాజకీయాల్లోకి వచ్చి ఏమీ చేయలేకపోయినందుకు ఆవేదనగా వుంది. ప్రజారాజ్యం ద్వారా రాజకీయ విప్లవం జరగకపోయినందుకు బాధగా వుందన్నారు. చిరంజీవిని ద్రోహం చేసిన వారికి చెప్పుతో కొట్టేలా జనసేన ఉండాలన్నారు. 
 
సినిమాల వల్ల వ్య‌వ‌స్థ‌లో మార్పురాద‌ని.. అందుకే రాజకీయాల్లోకి వచ్చానని విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టిస్తోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ త‌మ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడారు. తాము వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు చేయ‌లేక‌పోవ‌చ్చు కానీ, కొంత‌యినా మార్చుతామ‌ని అన్నారు. తన‌కు రాజకీయాల్లోకి రావాల‌ని ఉంద‌ని 2003లో త‌న‌ అమ్మానాన్న‌ల‌కి చెప్పానన్నారు. తాను ప్రజల పక్షం అన్నారు. దేశంతో జాతీయభావం కలిగిన పార్టీ ర రావాలని, బీజేపీ హిందు మతానికి మాత్రమే పరిమితం అయ్యిందన్నారు. ఇంత పెద్ద భారత దేశానికి రెండు పెద్ద పార్టీలు సరిపోవని పవన్ తెలిపారు. 
 
సినిమా త‌న‌కు అన్నం పెట్టిందని, రాజ‌కీయ వ్యవ‌స్థ బాగుంటే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాడిని కాద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది ఏదో సాధించ‌డానికి కాదని అన్నారు. త‌న‌ మ‌న‌స్సాక్షికి స‌మాధానం చెప్పుకునేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చానని చెప్పారు. తన‌కు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, స‌ర్దార్ ప‌టేల్, నెహ్రూ, అంబేద్క‌ర్ స్ఫూర్తి అని అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు తన మద్దతు వుండదన్నట్లు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు వాడుకుని వదిలేస్తారని అందరూ చెప్పారు. ఈ విషయం తనకు తెలియదా అని పవన్ అడిగారు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆర్కే నగర్‌ చూశారుగా మామా... ఇప్పటికైనా 'సై' అనండి... రజినీ అల్లుడు

మామయ్య.. ఒక్కసారి ఆలోచించండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి రావడమే మంచిది. ...

news

దైవ ప్రార్థనలో భర్తతో పోటీపడలేక భార్య సూసైడ్

కొందరికి తమ ఇష్టదైవమంటే చచ్చేంత ప్రేమ... పిచ్చి. ఆ మైకంలో వారు ఏం చేస్తున్నారో కూడా ...

news

అమ్మ చనిపోయిన రోజునే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది : విశాల్

చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన ...

news

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త మర్మాంగంపై వేడివేడి నూనె పోసిన భార్య!

అక్రమ సంబంధం మంచిది కాదనీ, సంసారాలు కూలిపోతాయనీ, అందువల్ల ఆ చెడు పని మానుకోవాలంటూ పదేపదే ...

Widgets Magazine