మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 6 డిశెంబరు 2017 (13:45 IST)

మళ్లీ పవన్ మద్దతిస్తేనే... లేదంటే జగన్ మోహన్ రెడ్డే కింగ్... లగడపాటి సర్వే

ఎపిలో సర్వేలు ఎవరైనా చేయిస్తున్నారంటే అది లగడపాటి రాజగోపాల్ అని ఠక్కున చెప్పేస్తుంటారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సర్వేలు చేయించి ముందుగానే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు లగడపాటి రాజగోపాల్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు లేకున్నాసరే లగడపాటి రాజగోపా

ఎపిలో సర్వేలు ఎవరైనా చేయిస్తున్నారంటే అది లగడపాటి రాజగోపాల్ అని ఠక్కున చెప్పేస్తుంటారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సర్వేలు చేయించి ముందుగానే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు లగడపాటి రాజగోపాల్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు లేకున్నాసరే లగడపాటి రాజగోపాల్ తాజాగా 2019 ఎన్నికలపై సర్వే చేయించారు. ఆ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. లగడపాటి ఆశ్చర్యపోవడమే కాకుండా ఆ విషయాన్ని మీడియాకు కూడా తెలిపారు. 
 
అదేంటంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పవన్ కళ్యాణ్‌‌తో కలిసి గెలవడం చాలా ఈజీ అనీ, ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం 120 సీట్ల కంటే ఎక్కువ రావని తేల్చి చెప్పాడు. ఇక జగన్ మోహన్ రెడ్డి పార్టీకి 137 సీట్లు వచ్చే అవకాశం ఉందట. కోస్తాలో 37 సీట్లు టిడిపికి రానుండగా ఫిరాంపులు ఎమ్మెల్యేలెవరూ తెలుగుదేశం పార్టీలో గెలవరని లగడపాటి సర్వేలో తేలింది. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కింగ్ మేకర్‌గా మారుతారని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు.