శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 23 జులై 2018 (15:11 IST)

అందుకే చంద్రబాబుకు ఆ రోజు దండం పెట్టేశా... పవన్ కళ్యాణ్ సంచలనం

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెదేపా పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 2012లోనే తను రాజకీయ పార్టీని పెట్టేందుకు చంద్రబాబు నాయుడిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే ఏపీ నుంచి 60 నుంచి

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెదేపా పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 2012లోనే తను రాజకీయ పార్టీని పెట్టేందుకు చంద్రబాబు నాయుడిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే ఏపీ నుంచి 60 నుంచి 70 సీట్ల వరకూ పోటీ చేయాలని అనుకున్నట్లు తెలియజేశారు. 
 
ఐతే ఇలా చేయడం వల్ల ఓట్లు చీలిపోయి నష్టపోతామని సూచించడం వల్ల మానుకున్నట్లు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతిస్తే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని కూడా చంద్రబాబు చెప్పినట్టు పవన్ వెల్లడించారు. ఐతే చంద్రబాబు నాయుడు వైఖరి తనకు నచ్చకపోవడంతో ఆయనకు దండం పెట్టేసి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీని కలిసినట్టు బాంబు పేల్చారు. వ్యవహారం చూస్తుంటే వచ్చే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భాజపాతో చేతులు కలుపుతారేమోనన్న అనుమానం వస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?