శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 5 జూన్ 2019 (17:46 IST)

పవన్ కళ్యాణ్‌‌కు ఏమైంది? కాలు తీసి బయట పెట్టలేకపోతున్నారట...

జనసేనాని పవన్ కళ్యాణ్‌ అనారోగ్యంగా ఉన్నారట. అది కూడా ఎన్నికలకు ముందు కంటిన్యూగా పర్యటనలు చేయడం, సభలలో ప్రసంగించడం, ఎండను లెక్కచేయకుండా ప్రచారాల్లో పాల్గొనడంతో పవన్ కళ్యాణ్‌ బాగా నీరసపడిపోయారట. ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని జిల్లాల్లో పర్యటించాలనుకున్నారు పవన్ కళ్యాణ్‌.
 
అయితే నీరసంగా ఉండటంతో పాటు వడదెబ్బ తగలడంతో తన పర్యటనలను పూర్తిగా రద్దు చేసుకుంటున్నారట. రేపు విజయవాడలో పవన్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ పర్యటనను రద్దు చేసేసుకున్నారు. కనీసం కాలు తీసి బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నారట పవన్ కళ్యాణ్‌. అందుకే తన పర్యటలను పూర్తిగా వాయిదా వేసుకుంటున్నారట.
 
నీరసంగా ఉన్నా ఒక్కోసారి వెళ్ళాలనుకుంటున్నారట పవన్ కళ్యాణ్‌. అయితే పార్టీ నేతలు వద్దని వారిస్తుండటంతో చివరకు వెనక్కి తగ్గుతున్నారట. ఇలా గత వారంరోజుల నుంచి తన పర్యటలన్నింటినీ రద్దు చేసుకుంటూనే వస్తున్నారట పవన్ కళ్యాణ్‌. ఎన్నికల తరువాత జనంలోకి పవన్ కళ్యాణ్ రాకపోవడం ప్రజల్లో తప్పుడు సంకేతాలకు వెళ్ళే ఆస్కారం ఉందన్న అనుమానాన్ని జనసేన పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో?