పవన్ పంచ్‌లు.. నేనెవరో తెలియదా.. సంతోషం... అంటూ ట్వీట్

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (12:22 IST)

pawan kalyan

జనసేనాన్ని పవన్ కల్యాణ్ మరోమారు టీడీపీ నేతలపై పంచ్‌లు పేల్చారు. జనసేన జెండా రాష్ట్రంలో ఎక్కడా లేదనీ, అసలు పవన్ కల్యాణ్ గురించి ఆలోచించే సమయమే తమకులేదంటూ గురువారం ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. గతంలో కూడా కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోకగజపతిరాజు ఓ సందర్భంలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అంటో ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను చర్చనీయాంశమయ్యాయి కూడా. 
 
ఇపుడు ఈ ఇద్దరి పేర్లను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. "అశోక్ గ‌జ‌ప‌తి రాజు గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలియ‌దు.. మంత్రి పితాని గారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏంటో తెలియ‌దు.. సంతోషం" అని ప‌వ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఈ ట్వీట్‌ను ప‌వ‌న్ అభిమానులు విప‌రీతంగా రీట్వీట్ చేస్తున్నారు. 'వాళ్లు మీ ద‌గ్గ‌రికి వ‌చ్చి త‌మ‌ను తామే ప‌రిచ‌యం చేసుకునే రోజు త్వ‌ర‌లో వ‌స్తుంది అన్నా!', 'నువ్వేంటో చూపించే టైమ్ వ‌చ్చింది అన్నా!' అంటూ ప‌లువురు అభిమానులు ఈ ట్వీట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. 
 
 దీనిపై మరింత చదవండి :  
Tweet Pawan Kalyan Minister Pithani Ashok Gajapathi Raju

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళకు పెరోల్‌ మంజూరు... దినకరన్‌కు షాక్.. గవర్నర్‌గా పురోహిత్ ప్రమాణం

అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ...

news

'నారాయణ'లో ఆగని ఆత్మహత్యలు... మరో విద్యార్థిని సూసైడ్

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థుల ...

news

మహాత్మా గాంధీని చంపిన మరో వ్యక్తి ఎవరు?

జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే చంపినట్టు చరిత్ర చెపుతోంది. అయితే, ఆయన్ను గాడ్సే పాటు మరో ...

news

సింగరేణి సిగలో 'గులాబీ' పూసింది... చరిత్ర సృష్టించిన తెరాస కార్మిక సంఘం

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని ...