సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (11:38 IST)

నేడు విశాఖ గర్జన.. వైజాగ్‌కి జనసేనాని.. భారీగా బందోబస్తు

Pawan Kalyan
విశాఖ గర్జన నేడు జరుగనుంది. మరోవైపు అక్టోబర్ 15 నుంచి మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్రలో జనవాణితో పాటు పలు కార్యక్రమాల కోసం పవన్ విశాఖలో అడుగుపెట్టనున్నారు.

పవన్ రాక సందర్భంగా ఉత్తరాంధ్రకు చెందిన జనసేన నేతలు విశాఖకు వస్తున్నారు. వీరితో పవన్ బిజిబిజీగా గడపబోతున్నారు. అసలే అమరావతి రాజధానికి అనుకూలంగా వున్న పవన్ కళ్యాణ్ వైసీపీ గర్జన రోజే ఇక్కడికి వస్తుండటంతో ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా వుండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  

ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా విశాఖలోనే ఉత్తరాంధ్ర పార్టీ నేతల భేటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతి రాజధానికే మద్దతిస్తున్న టీడీపీపై స్థానికంగా వ్యతిరేకత పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో సేవ్ ఉత్తరాంధ్ర నినాదంతో దీన్ని కౌంటర్ చేయాలని చంద్రబాబు తమ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో సేవ్ ఉత్తరాంధ్ర నినాదంతో దీన్ని కౌంటర్ చేయాలని చంద్రబాబు తమ నేతలకు సూచించారు.