శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 23 అక్టోబరు 2017 (21:15 IST)

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తాం... ఎవరు?

నవంబర్ నెలలో వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికల దృష్ట్యా ఎన్నికల స్టంట్ కోసమే జగన్ పాదయాత్ర చేపట్టారంటూ ఆయనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ లబ్ది కోసమే జగన్ పాదయాత్ర అని అధ

నవంబర్ నెలలో వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికల దృష్ట్యా ఎన్నికల స్టంట్ కోసమే జగన్ పాదయాత్ర చేపట్టారంటూ ఆయనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ లబ్ది కోసమే జగన్ పాదయాత్ర అని అధికార తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. జగన్ పాదయాత్ర వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. 
 
ఇదిలావుంటే గుర్తు తెలియని వ్యక్తులు కొందరు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారట. వైసీపి సీనియర్ నేతలకు అగంతకులు ఫోన్లు చేస్తున్నారట. రకరకాల నెంబర్ల నుంచి కాల్స్ రావడం.. అన్నీ జగన్ దృష్టికి తీసుకెళితే ఇదంతా మామూలే.. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కొట్టి పారేస్తున్నారట.