శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 14 అక్టోబరు 2017 (17:32 IST)

జగన్ చెబితే రాజీనామా చేయాలా... నేను చేయను... తిరుపతి ఎంపి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. ఎందుకు రాజీనామా చేయాలి.. రాజీనామా చేసినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా.. ఏమీ లేదు.. ఎవరో చెప్పారని రాజీనామా చేస్తే పార్లమెంటులో ఎవరు మాట్లాడుతారు.. ఆలోచించండి.. ఈ మాటలంతా చెప్పింది సాక్షాత్తు తిర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. ఎందుకు రాజీనామా చేయాలి.. రాజీనామా చేసినంత మాత్రాన ఉపయోగం ఉంటుందా.. ఏమీ లేదు.. ఎవరో చెప్పారని రాజీనామా చేస్తే పార్లమెంటులో ఎవరు మాట్లాడుతారు.. ఆలోచించండి.. ఈ మాటలంతా చెప్పింది సాక్షాత్తు తిరుపతి పార్లమెంటు సభ్యులు వరప్రసాద్.
 
ప్రత్యేక హోదాపై ఎంపిల చేత రాజీనామా చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి ఎంపి మాత్రం జగన్ చెబితే రాజీనామా చేయాలా.. నేను చేయను.. ఎంపిగా వుండి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తాం... వైసిపికి ఉన్న ఎంపిలే 6, 7 మంది వీరు కూడా రాజీనామా చేస్తే ఇంకేముంటుంది అని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో పాత్రికేయులనే ప్రశ్నించారు వరప్రసాద్.