శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 6 మార్చి 2018 (22:21 IST)

ఏపీ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడిగా పోసాని క్రిష్ణమురళి...?!!

పోసాని క్రిష్ణమురళి. ఈయన గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. అందరికీ బాగా తెలిసిన వ్యక్తే. ప్రజారాజ్యం పార్టీలో కొన్నిరోజుల పాటు ఉండి ఆ తరువాత రాజకీయాలకు దూరమైపోయాడు పోసాని క్రిష్ణమురళి. అయితే అప్పుడప్పుడూ అడపాదడపా టివి ఇంటర్వ్యూల్లో పాల్గొని తనకు నచ్చ

పోసాని క్రిష్ణమురళి. ఈయన గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. అందరికీ బాగా తెలిసిన వ్యక్తే. ప్రజారాజ్యం పార్టీలో కొన్నిరోజుల పాటు ఉండి ఆ తరువాత రాజకీయాలకు దూరమైపోయాడు పోసాని క్రిష్ణమురళి. అయితే అప్పుడప్పుడూ అడపాదడపా టివి ఇంటర్వ్యూల్లో పాల్గొని తనకు నచ్చిన వారి గురించి మాట్లాడుతూ నచ్చని వారిని ఏకిపారేసేవారు. తన వ్యక్తిత్వం తనిష్టం.. నేను ఒకరిలాగా ఉండాల్సిన అవసరం లేదు. నాకు నేనుగా ఉంటాను.. అంటూ ఎన్నోసార్లు పోసాని చెప్పుకొచ్చారు. 
 
గత కొన్నిరోజుల ముందు కూడా ఒక టివి ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత హనుమంతరావుతో గొడవపడి చివరకు కొట్టుకునే వరకు వెళ్ళింది. అయినాసరే పోసాని మాత్రం తాను అనుకున్నదే చేయాలంటాడు. అలాంటి వ్యక్తి గత కొన్నిరోజులుగా బిజెపి నేతలతో టచ్‌లో ఉన్నాడు. అది కూడా బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో బాగా క్లోజ్‌గా ఉంటూ వస్తున్నాడు. తాను ఎక్కడికి వెళ్ళినా ప్రధాని నరేంద్ర మోదీ గొప్పతనం గురించే చెబుతూ వస్తున్నాడు. అందుకే పోసానిని బిజెపిలోకి తీసుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు సిద్ధమైపోయారు.
 
త్వరలో పోసానికి ఏపీ బిజెపి పార్టీ ఉపాధ్యక్ష పదవిని అప్పజెబుతున్నట్లు బిజెపి నేతలే చెబుతున్నారు. పోసాని స్వస్థలం గుంటూరు జిల్లా పెదకాకాని. గుంటూరులో జరిగే బిజెపి కార్యక్రమంలోనే తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బిజెపి నేతలు గుంటూరులో సమావేశం కానున్నారని, ఆ సమావేశంలోనే పోసాని బిజెపి తీర్థం కూడా పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.