బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 22 సెప్టెంబరు 2021 (20:01 IST)

మోడీ హయాంలో దేశం విరాజిల్లుతోంది: ప్రకాష్ జవదేకర్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు సంధ్భంగా 20రోజుల పాటు సేవా సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బిజెపి నాయకులు. తిరుపతిలో జరిగిన సేవా సమర్పణ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడిన ప్రకాష్ జవదేకర్ చెట్లు నాటి ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ హయాంలో దేశం విరాజిల్లుతోందని ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
 
స్వచ్ఛ ఇండియా, డిజిటల్ ఇండియాగా దేశం మారిపోయిందన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, కరోనా సమయంలో ఉచిత రేషన్ నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. బిజెపిపై కాంగ్రెస్ పార్టీ విమర్సలు సరైంది కాదన్నారు. 
 
దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉండటం ఎంతమాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇష్టం లేదేమోనన్నారు ప్రకాష్‌ జవదేకర్. విమర్సలు మానుకుని అభివృద్ధికి సహకరించాలన్నారు.