గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 6 అక్టోబరు 2021 (11:21 IST)

సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై జీవో 35ను అమలు చేయాలని నట్టి కుమార్ పిటిషన్

రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో ఇచ్చిన జీవో 35ను అమ‌లు చేయాల‌ని నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపారు. 
 
సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 8న ఇచ్చిన జీవో 35 అమలు కోసం నిర్మాత, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 5 న తాను ఇచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. జీవో 35, ఏపీ సినిమాలు (క్రమబద్ధీకరణ) చట్టంలోని సెక్షన్లు 9,10,11 లకు అనుగుణంగా పిటిషనర్ ఇచ్చిన వినతిపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖపట్నం సంయుక్త కలెక్టర్, అనకాపల్లి ఆర్డీవోను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 
 
సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల పెంపుపై జీవో 35 వివాదాస్ప‌దంగా మారిన నేప‌థ్యంలో తెలుగు సిని ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. మ‌రో ప‌క్క రాష్ట్ర ప్ర‌భుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ పైనా రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. ఈ నేప‌థ్యంలో జీవో 35 అమ‌లుకు న‌ట్టికుమార్ కోర్టు త‌లుపులు త‌ట్టారు.