గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:31 IST)

పూజా హెగ్దె చేస్తున్న పనికి ప్రభాస్ గరంగరంగా వున్నాడా? (video)

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన, బహుళ భాషా చిత్రం మకర సంక్రాంతి 2022న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది. ఐతే 'బాహుబలి' స్టార్ ప్రభాస్ సెట్స్‌లో పూజా హెగ్దె వ్యవహరిస్తున్న తీరుపై చాలా కోపంగా వున్నాడంటూ పుకార్షు షికారు చేస్తున్నాయి. ఐతే ఈ పుకార్లను యూవీ క్రియేషన్స్ కొట్టిపారేసింది.
ప్రభాస్, పూజా హెగ్దె ఒకరిపై ఒకరికి గొప్ప గౌరవం వుందనీ, వారు ఆఫ్-స్క్రీన్‌లో గొప్ప స్నేహాన్ని పంచుకుంటారని చెప్పుకొచ్చారు. పూజాహెగ్దెపై ప్రభాస్ అసహనంగా వున్నారంటూ కొంతమంది ప్రచారం చేస్తున్న విషయంలో ఎలాంటి నిజం లేదని అన్నారు.
సెట్స్‌కి పూజా ఆలస్యంగా వస్తుదన్న రూమర్లు కూడా కొట్టిపారేశారు. పూజ తన షూట్‌ల కోసం ఎల్లప్పుడూ సమయపాలనతో ఉంటుంది. ఆమెతో పని చేయడం చాలా సులభం. ఈ పుకార్లు ఎవరో కొంతమంది పనిగట్టకుని సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.