సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (22:38 IST)

రేపు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి.
 
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఉచిత ఇంటర్నెట్‌
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఐదేళ్ల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సేవలందించేందుకు ఎస్‌ఎ్‌సఆర్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. ఆ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సామాను శ్రీధర్‌రెడ్డి ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజును కలసి ఒప్పందపత్రం అందజేశారు. ఇంటర్నెట్‌ వినియోగానికి గాను నెలకు రూ.7.50లక్షల వంతున తమ ఫౌండేషన్‌ చార్జీలు చెల్లిస్తుందని చెప్పారు.