Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సర్.. ఇక ఆ బాధ్యత నా వల్ల కాదు... రాహుల్‌కు తేల్చి చెప్పిన రఘువీరా?

బుధవారం, 24 జనవరి 2018 (21:35 IST)

Widgets Magazine

రాష్ట్ర విభజన జరిగి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన విషయం తెలిసిందే. అస్సలు కాంగ్రెస్ పార్టీకి నాయకులే కరువయ్యారంటే ఆ పార్టీ పరిస్థితి ఎలాంటిదో చెప్పనవసరం లేదు. తెలంగాణా రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఎపిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయమే. కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆ పార్టీ పేరును బయటకు చెప్పుకోవడానికి భయపడిపోతున్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు వస్తే మాత్రం వారి వెనుక కొద్దిసేపు కూర్చుని ఆ తరువాత వెళ్ళిపోతున్నారు.
 
ఎపిలో కాంగ్రెస్ పార్టీకి చీఫ్‌‌గా ఉన్న రఘువీరారెడ్డి గత కొన్నిరోజులుగా ఆ పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాను పార్టీకి చీఫ్‌‌గా ఉన్నా సరే ఆ పార్టీలోని నేతలే గౌరవం ఇవ్వకపోవడం.. ఎక్కడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరగకపోవడం రఘువీరారెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో ఆ పార్టీ బాధ్యతల నుంచే పూర్తిగా పక్కకు తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట రఘువీరారెడ్డి. 
 
నిన్న ఢిల్లీకి వెళ్ళిన రఘువీరా రెడ్డి.. నేరుగా రాహుల్ గాంధీని కలిసి.. సర్..ఇక నా వల్ల కాదు.. నేను ఈ బాధ్యతను కొనసాగించలేను. వేరే ఎవరికైనా అప్పజెప్పండంటూ విన్నవించుకున్నారట. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఇలాంటి చిన్నచిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవద్దండి.. మీలాంటి నాయకులే ఆ పదవికి ఎంతో అవసరం అంటూ రఘువీరారెడ్డిని బుజ్జగించారట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రఘువీరా రెడ్డి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలిసిన వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెల్ఫీ వీడియో పిచ్చి.. ట్రైన్ వస్తుండగా ఫోజు.. తలకు, చేతికి తీవ్ర గాయాలు.. (వీడియో)

యువతకు సెల్ఫీల పిచ్చి బాగా ముదిరింది. సెల్ఫీలపై మోజుతో, లైక్స్, షేర్ల పిచ్చితో ప్రాణాలను ...

news

దాణా స్కామ్ : మూడో కేసులో కూడా లాలూ ముద్దాయే.. ఐదేళ్ళ జైలు

దాణా స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పటికే ...

news

స్మార్ట్‌ఫోన్ ద్వారా అశ్లీల చిత్రాలు-యువతి ఎంత పనిచేసిందో తెలుసా?

యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇలాంటి కేసుల్లో నిందితులకు ...

news

విలువైన రాయి అనుకుని ఫ్రిజ్‌లో పెట్టారు.. ఆపై యాక్ అని వాంతులు చేసుకున్నారు.. ఎందుకు?

ఢిల్లీ విమానం నుంచి కింద పడిన మానవ వ్యర్థాన్ని ఉల్కా శకలంగా భావించి ఫ్రిజ్‌లో పెట్టారు ఓ ...

Widgets Magazine