బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (11:08 IST)

దూసుకొస్తున్న దానా తుఫాను... ఏపీపై ప్రభావమెంత?

rain
దానా తుఫాను దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయాన్ని వాయుగుండంగా మారింది. ఆ తర్వాత సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగామారింది. బుధవారం తుఫానుగా మారి గురువారం తెల్లవారుజాముకు తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తీవ్ర తుఫాను శుక్రవారం ఉదయం లోపు ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సాగర్ ద్వీపం మధ్యంలో తీరం దాటొచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. 
 
ఈ తీవ్ర తుఫాను దానా ముప్పుపొంచివున్న నేపథఅయంలో ఏపీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ మాజీ ఎండీ కేజే రమేష్ తెలిపారు. ప్రస్తుతం అంచనచా ప్రకారం ఒడిశా, వెస్ట్ బెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లవొచ్చని, ఈ కారణంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, వైజాగ్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
 
అలాగే, తమిళనాడులో ఈ తుఫాను ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీ వ్యాప్తంగా రాబోయే మూడు రోజులు పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.