ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , సోమవారం, 16 ఆగస్టు 2021 (10:41 IST)

ర‌మ్య హ‌త్య‌పై సీఎం ఆరా; కుటుంబానికి రూ.10లక్షల ప‌రిహారం

గుంటూరులో యువతి రమ్య హత్యా ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

‘దిశ’ కింద వేగంగా చర్యలను తీసుకుని దోషికి కఠినశిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే, హోంమంత్రి సుచ‌రిత‌ ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని, పరిహారంగా రూ.10లక్షలు ఆకుటుంబానికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిందితుడికి క‌ఠిన శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న పోలీసు అధికారుల‌ను ఆదేశించారు.