బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (16:43 IST)

రవిప్రకాశ్ సంజీవని ఆస్పత్రి వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలి

ప్రముఖ నాట్యకేంద్రం కుచిపూడిలోని చెరువు పూడ్చి ప్రభుత్వ స్థలంలో కట్టిన రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి వ్యవహారంపై విచారణ జరిపించాలని వైకాపా శ్రేణులు కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి సంవత్సరం గడిచినా ఇంతవరకు నిర్వహణ ఏమాత్రం లేదని స్థానికులు, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
దాదాపు 150 గ్రామాల ప్రజలకు మేలైన మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ వైద్యసౌకర్యం కల్పించేందుకు సిలికానాంధ్ర చొరవతీసుకుంటుందనే ప్రచారం చేసి కూచిపూడి గ్రామంలోని "పసుమర్తివారి గ్రామ చెరువు"ని పూడ్చిన స్థలం తొలుత కూచిపూడి కళాపీఠానికి కేటాయించగా ఈ ఆస్పత్రి ప్రతిపాదన తెచ్చి అందులో ఒక ఎకరం ఈ ఆస్పత్రి కోసం తీసుకున్నారు. అయితే పూర్తిగా సుప్రీం కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా పూడ్చిన ఈ పసుమర్తి వారి గ్రామ చెరువును పూడ్చటం విరుద్ధం. పైగా ఇది ఏ ట్రస్ట్ లేదా వ్యక్తుల పేరుతో కేటాయించారు అనేది తెలియాల్సివుంది కూడా.
 
 
ఇక పోతే ఈ ఆసుపత్రి సిలికానాంధ్ర పేరుతో మాత్రమే నిర్మాణం చెయ్యాల్సివుండగా రానురాను స్థానికులు, ఎన్‌ఆర్‌ఐ వద్ద నుండి భారీగా విరాళాలు సేకరించారనే ఆరోపణలున్నాయి కూడా. పైగా సుమారు లక్ష అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ భవనం నిర్మాణ వ్యయం 25 కోట్లు వేసినా దానికి అంతర్జాతీయ రోటరీ సంస్థ ఆధునిక పరీక్షా మిషన్లు, అంతర్జాతీయ లైన్స్‌క్లబ్ బెడ్లు విరాళం ఇచ్చినట్లు అలాగే టైల్స్, సిమెంట్, ఇనుములను కూడా కొందరు స్థానిక దాతలు పెద్దమనసుతో పరిసర ప్రాంత ప్రజలకు మేలైన వైద్యం జరుగుతుందనే ఆశయంతో విరాళంగా ఇచ్చారని ఒక ప్రముఖుడు తెలిపారు.
 
పైగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ 4 కోట్ల విరాళం ఇచ్చినట్లు చెప్పి ఈ ప్రాంతంతో  ఏమాత్రం సంబంధంలేని ఆయన పేరును ఆసుపత్రికి కూడా తగిలించారు కూడా. ఆ నాలుగుకోట్ల రూపాయలు కూడా ఎవరికి ఎప్పుడు ఇచ్చింది కూడా తెలియదు. పైగా ఈ రోజు అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులు విడుదల చేసిన వార్తలో ఆయన డ్రా చేసినట్లు పేర్కొన్న మొత్తంలో ఈ నాలుగు కోట్లు విషయం లేదు. అసలు ఇచ్చారా లేదా ఇస్తే ఆ చెక్కు తాలూకు బ్యాంకులో ఎందుకు డ్రా అవ్వలేదని సందేహిస్తున్నారు. కాగా ఆసుపత్రి ప్రారంభం రోజు మాజీ ముఖ్యమంత్రి ఈ ఆసుపత్రికి  ప్రకటించిన రూ.10 కోట్ల నిధులు వచ్చాయో లేదో కూడా తెలియని స్థితి. 
 
కారణం దీనిపై అటు స్థానికులకు ఇటు అధికారులకు కూడా అజమాయిషీ లేకపోవటమేనని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
పైగా ఒక్క చోటుకూడా దాతలు ఇచ్చిన విరాళంలు కూడా తెలియ చేసే పేర్లు ప్రదర్శించలేదనే అసంతృప్తి దాటల్లో ఉంది. ఎంతో హడావిడిగా మరెంతగానో గొప్పగా నిర్మిస్తామని చెప్పి నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రారంభమై సంవత్సరం అవుతున్న ఇంతవరకు ఏ మాత్రం అందుబాటులోకి రాకపోగా అరకొరగా ఉన్నప్పటికీ 150 రూపాయలు కన్సల్టింగ్ ఫీజ్ వసూలు చెయ్యటం పలు అనుమానాలకు చోటు ఇస్తోందని వారు వాపోతున్నారు. 
 
వెంటనే ఉన్నత స్థాయి అధికారులు, నిఘా సంస్థలు దీని వ్యవహారంలో దర్యాప్తు జరిపి భారీగా దీని పేరుతో నిధుల వసూళ్లు అయ్యాయని అనుమానిస్తున్న స్థానికులు, డోనర్లు అనుమానాలను తీర్చాలని, వెంటనే ప్రభుత్వం దాన్ని దాన్ని స్వాధీనంచేసుకోవలని కోరుతున్నారు.
   ప్రజాప్రయోజనం కోసమని చెప్పి ఏమాత్రం వినియోగంలోకి రాకుండా ఉన్న ఏ సంస్థ మీదైనా దర్యాప్తు చెయ్యటం ప్రభుత్వ కర్త్యవ్యం. 
 
ఇటీవల 50 రూపాయల దసరా మామూళ్లు వసూలు చేసిన నలుగురు వాలంటీర్లను నిర్దయగా తొలగించిన ప్రభుత్వం ఈ ఆసుపత్రి విషయంలో జరిగిన అసలు వాస్తవాలు వెలుగులోకి తేవాలని, ఒకవేళ అపసవ్య దిశగా వెళుతుంటే ఏమాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఒక ప్రముఖ నాయకుడు హెచ్చరించారు. దీని వెనుకుండి నడిపించిన వారినీ తమ ప్రభుత్వం వదిలి ప్రేక్షక పాత్రగా ఉండదని దృఢంగా చెప్పారు. 
 
 
తొలుత చెప్పిన దానికి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న దానికీ పొంతనలేక అక్కడివారు అయోమయంలో వున్నారు.
 వెంటనే ప్రభుత్వం దర్యాప్తు చేయించి ముందు ఆసుపత్రిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. పూర్తీగా దీనిపై ప్రభుత్వం వాస్తవాలు పరిశీలించి బాగా ఉంటే కావలసిందేమీ లేదు. అయితే అవకతవతలుంటే దర్యాప్తు నిక్కచ్చిగా ఉండాలని కోరుతున్నారు.