శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (14:15 IST)

ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తి

అత్యాచారం, హత్యకు గురైన ఆయేషామీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు ఆయేషా మృతదేహం ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆధారాలు సేకరించి నివేదిక తయారుచేస్తామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికలో పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం శవపరీక్ష పూర్తి చేశారు. సీబీఐ ఎస్పీ విమల్‌ ఆదిత్య నేతృత్వంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆయేషామీరా మృతదేహం వెలికితీసి... ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు.

రీపోస్టుమార్టంలో పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాలను, ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. ఆయేషామీరా ఎముకల నుంచి అవశేషాలను ఫోరెన్సిక్‌ బృందం సేకరించింది.

ఆయేషా మీరా 2007 డిసెంబర్‌ 27న అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. సీబీఐ విచారణలో భాగంగా ఫోరెన్సిక్‌ నిపుణులు రీపోస్టుమార్టం నిర్వహించారు.