బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (05:26 IST)

వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రగతి రివర్స్‌..టీడీపీ

రాష్ట్రంలో ఐదు నెలల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు ఆరోపించారు. అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన నేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందన్న పొలిట్​ బ్యూరో... గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. టీడీపీ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో మూడో వంతు పదవులను యువత, మహిళలకు కేటాయించాలని పార్టీ పొలిట్​ బ్యూరో నిర్ణయించింది.

టీడీపీ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో మూడో వంతు పదవులను యువత, మహిళలకు కేటాయించాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. 50 శాతం పదవులను వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని నేతలు తీర్మానం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నేతలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే 17 శాతం ఆదాయం తగ్గిందని టీడీపీ పోలిట్​ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. పరి'పాలన' స్తంభించింది రాష్ట్రంలో పరిపాలన మొత్తం స్తంభించిపోయిందనే అభిప్రాయాన్ని పొలిట్​ బ్యూరో వ్యక్తం చేసింది. తెదేపా హయాంలో 11 శాతం వృద్ధిరేటు సాధిస్తే... పూర్తిగా నాశనం చేసిందని నేతలు మండిపడ్డారు.

తెలంగాణ సీఎం కేసీఆర్​, జగన్​ల స్నేహం వ్యక్తిగతమని అయితే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు వారి వ్యక్తిగతం కాదని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో కలిసి పని చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతామంటే సహించేది లేదని నేతలు స్పష్టం చేశారు.

వైసీపీ విధానాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా పరిశ్రమ ప్రారంభోత్సవానికి సీఎం వెళ్లకపోగా... స్థానిక ఎంపీ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఆత్మహత్యలపై ఆవేదన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై పొలిట్ బ్యూరో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరు ముఖ్యమంత్రుల పోకడలు ఒకేలా ఉన్నాయని నేతలు దుయ్యబట్టారు. మీడియాపై ఆంక్షలు దుర్మార్గమని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా సీఎం జగన్‌ నిర్ణయాలు ఉన్నాయని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు మండిపడ్డారు.

మద్యంపై వచ్చే ఆదాయంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారని... నల్లమలలో యురేనియం తవ్వకాలను సమావేశంలో తప్పుపట్టారు. 1

3 అంశాలపై చర్చ రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యతో పాటు నిరుద్యోగ భృతి నిలిపివేత, టీడీపీ కార్యకర్తలపై దాడులు, విద్యుత్ కోతలు, ఉపాధి హామీ నిధులు నిలిపివేత, మద్యం ధరల పెంపు, జె-ట్యాక్స్ పేరిట వసూళ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి-అసత్య ప్రచారాలు, గ్రామసచివాలయాల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు, వివిధ సంక్షేమ పథకాల రద్దు వంటి మొత్తం 13 అంశాల అజెండాపై పొలిట్‌ బ్యూరోలో సుదీర్ఘంగా చర్చించారు.

ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుతోపాటు, ఇతర నాయకుల మృతికి పొలిట్ బ్యూరో సంతాపం తెలిపింది. గోదావరిలో పడవ ప్రమాద మృతులకు నేతలు సంతాపం ప్రకటించారు.