మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (15:42 IST)

కరీఫ్ సీజన్.. ఏపీకి రూ.900 కోట్లు.. కంటి తుడుపు చర్యేనా?

ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీతో నాలుగు రాష్ట్రాలకు కరవు సహాయ నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్రకు రూ.4700 కోట్లు, కర్ణాటకకు రూ.950 కోట్లను తక్షణమే విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ చెప్పారు. 
 
ఇదే తరహాలో ఏపీకి రూ.900 కోట్లు, గుజరాత్‌కు రూ.130 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మొత్తాన్ని కరీఫ్ సీజన్ 2018-19కి గానూ విడుదల చేస్తున్నట్లు రాధా మోహన్ సింగ్ వెల్లడించారు. 
 
ఇకపోతే.. గతంలో ఏపీలో వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకుంది. ఏపీ రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చామని వెనకబడిన జిల్లాలకు రూ.1050 కోట్లు అలాగే విజయవాడ,గుంటూరు జిల్లాల్లో డ్రైనేజీ నిర్మాణానికి రూ.1000 కోట్లు ఇచ్చామని, పోలవరానికి రూ.6,764.7 కోట్లు ఇచ్చామని పాత లెక్కలు చెప్పిన సంగతి తెలిసిందే. 
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పలుమార్లు ఎన్నికల సభల్లో మోడీ సర్కార్ ఊదరకొట్టింది. తిరుపతి సభలో సాక్షాత్తు వెంకన్న సాక్షిగా మోడీ మాట ఇచ్చారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని  పలికారు. కానీ రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌లో ఉంది. ఆర్థిక రాబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి.