బాబోయ్ గుంతలు... ఈ రోడ్లపై బస్సులు తోలేదెలా?
గుంటూరు జిల్లా తెనాలి వద్ద ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పెదరావూరు వద్ద కాల్వ అంచులోకి ఒరిగిపోయిన బస్సు, కొంచెం ఉంటే, కాలువలో కొట్టుకుపోయేది. తెనాలి నుండి ప్రయాణికులతో భట్టిప్రోలు - రేపల్లె వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
రహదారిపై ఏర్పడ్డ గుంతల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. రాష్ట్రంలో రహదారులు ఇలా గుంతల మయం అయిపోతే, ఇక ఈ రోడ్లపై బస్సులను ఎలా తోలేదని డ్రైవర్లు తలలు పట్టుకుంటున్నారు. చివరికి క్రేన్ సహాయంతో బస్సును ఆర్టీసీ అధికారులు పక్కకు లాగుతున్నారు.