సినీ పరిశ్రమ పెద్దలకే గుదిబండగా పవన్ కల్యాణ్!
జనసేన అధినేత పవన్ పై వైసీపీ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. ఆయన వరుస ట్వీట్లను అధికార పక్షనేతలు తిట్లతో ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్నారు. సినీ పెద్దలతో చర్చలు చేస్తున్న సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తాజాగా పవన్ పై ట్వీట్ చేయగా, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన వంతు అందుకుంటున్నారు.
సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నామని, అలాంటి మాపై బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బందిగా మారుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తీరుపై పవన్ విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై సజ్జల స్పందించారు. పవన్‌ను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ వారితో చర్చించేందుకు మేం సిద్ధంగానే ఉన్నాంఅని సజ్జల చెప్పారు. సినీ పెద్దలతో తాము చర్చిస్తుంటే, మధ్యలో పవన్ ట్వీట్ల ఏంటని ఆయన ప్రశ్నించారు. బద్వేలు ఉప ఎన్నికలో మంచి మెజారిటీతో గెలుస్తామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.