మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (10:56 IST)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మకర సంక్రాంతి అని కూడా పిలువబడే ఈ పండుగను కొత్త సౌర సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. 
 
ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు ఆలయాలలో వైభవంగా పూజలు చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గాలిపటాల పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. 
 
పసందైన వంటకాల ఘుమఘుమలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. పంట కాలం ముగిసి కొత్త సౌర సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల గ్రామాలకు పట్టణాలకు వెళ్లిన వారంతా తిరిగి చేరుకున్నారు. భోగి మంటలు, రేగి పండ్లు, పసందైన వంటకాలు, పొంగళ్లు, రంగవల్లికలతో తెలుగు రాష్ట్రాలు కళకళలాడుతున్నాయి.