శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (17:42 IST)

ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంతీర్పు క్షేత్రస్థాయిలో అమలు అసాధ్యం : అసదుద్దీన్

ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ క్షేత్ర స్థాయిలో అమలు అసాధ్యమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ త‌లాక్‌ రాజ్యాంగ విరుద్ధ‌మంటూ సుప్రీంకోర్టు చ

ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ క్షేత్ర స్థాయిలో అమలు అసాధ్యమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ త‌లాక్‌ రాజ్యాంగ విరుద్ధ‌మంటూ సుప్రీంకోర్టు చారిత్ర‌క తీర్పు వెలువ‌రించిన విష‌యం తెలిసిందే. ఎన్నో నెల‌ల విచార‌ణ త‌ర్వాత మంగళవారం తుదితీర్పును వెలువరించింది. 
 
ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని ఐదు మ‌తాల‌కు చెందిన ఐదుగురు స‌భ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3-2 మెజార్టీతో త‌లాక్ రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని తీర్పునివ్వ‌డ‌మే కాకుండా పార్లమెంట్‌లో ఆరు నెల‌ల్లో కొత్త చ‌ట్టం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. 
 
దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌర‌విస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. అయితే క్షేత్ర‌స్థాయిలో తీర్పు అమ‌లు చేయ‌డం మాత్రం స‌వాలే అని అస‌ద్ అన్నారు.