మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:19 IST)

37 ఏళ్లలో 37 సార్లు పాము కాటు

చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట పంచాయతీ కురవూరుకు చెందిన ఓ వ్యక్తి 
37 సార్లు పాము కాటుకు గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. సుబ్రమణ్యం (42) అనే వ్యక్తిని పాము 37 సార్లు కాటేసింది. నిరుపేద కుటుంబానికి చెందిన సుబ్రమణ్యంకు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే సుబ్రమణ్యం ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో మొదటిసారి పొలం వద్ద పాము కాటేసింది.

అప్పటి నుంచి పాములు పగబట్టినట్లుగా సుబ్రమణ్యంను వెంటాడుతూ ప్రతి ఏటా ఓసారి కాటేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. 37 ఏళ్లలో 37 సార్లు సుబ్రమణ్యం కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే నాగుపాములు కాటేస్తుండడం విశేషం.

ఒకసారి పాము కాటేసిందంటే కనీసం 10 రోజులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు చికిత్స కోసం రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెక్కాడితేగానీ డొక్కాడని సుబ్రమణ్యంను నాలుగు రోజుల క్రితం మళ్లీ పాము కాటు వేయడంతో శంకర్రాయలపేటలోని జెఎంజె ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు.