శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శనివారం, 5 మే 2018 (13:27 IST)

చై.నా విడిపోయిందా? లేదా చైనా బ్యాచ్ విడిపోయిందా?

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థలయిన శ్రీ చైతన్య, నారాయణ కొన్నాళ్ల క్రితం ‘చైనా’ బ్యాచ్ పేరుతో జతకట్టాయి. అయితే ఈ రెండు సంస్థలకు ఏడాదిలోనే విభేదాలొచ్చి తెగతెంపులు చేసుకున్నాయి. నారాయణ విద్యాసంస్థలతో ఇకపై తమకు ఎలాంటి ఒప్పందం లేదని ‘చైనా’ బ్యాచ్

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థలయిన శ్రీ చైతన్య, నారాయణ కొన్నాళ్ల క్రితం ‘చైనా’ బ్యాచ్ పేరుతో జతకట్టాయి. అయితే ఈ రెండు సంస్థలకు ఏడాదిలోనే విభేదాలొచ్చి తెగతెంపులు చేసుకున్నాయి. నారాయణ విద్యాసంస్థలతో ఇకపై తమకు ఎలాంటి ఒప్పందం లేదని ‘చైనా’ బ్యాచ్‌ను ఈ యేడాది నుంచి రద్దు చేస్తున్నామని శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ బీఎస్‌ రావు ప్రకటించారు. 
 
తమ విద్యార్థుల ర్యాంకులను నారాయణ విద్యా సంస్థలు అక్రమంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. 
శ్రీచైతన్య జాతీయ ర్యాంకులేవీ సాధించలేదని నారాయణ యాజమాన్యం వ్యాఖ్యానిస్తుండగా, జేఈఈ మెయిన్‌లో, ఏపీ ఎంసెట్‌ ఫలితాల్లో ర్యాంకర్లు నారాయణ విద్యార్థులే అయితే ప్రకటించుకునేందుకు భయం ఎందుకని ప్రశ్నించారు. తమ విద్యార్థులను వారి విద్యార్థులుగా చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదేవిధంగా చేస్తే లీగల్‌ చర్యలకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.