గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 3 జనవరి 2019 (11:21 IST)

నేటి బంద్ హిందువులు మనోభావాలకు ప్రతీక: స్వామీ పరిపూర్ణానంద

కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి కుట్ర దేశవ్యాప్తంగా జరగుతోందని బీజేపీ నేత, స్వామి పరిపూర్ణానంద మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... దేవాలయాలను రాజకీయలకు అడ్డాగా మార్చారని వ్యాఖ్యానించారు. కేరళలో కంటే ఇతర రాష్ట్రాల నుంచి వేలమంది భక్తులు అయ్యప్పమాల వేసుకుని కేరళకు వెళతారని తద్వారా రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందన్నారు. 
 
గతంలో సుప్రీంకోర్టు కేరళలోని చర్చిలపై కూడా అనేక తీర్పులు ఇచ్చిందని, దానిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. దేవాలయాలతో సాంప్రదాయాలను దెబ్బతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇతర మతస్థులు వేసిన కేసును కోర్టు పరిగణనలోకి తీసుకోవడం బాధకరం అన్నారు. 
 
కేరళ సిఎం అయ్యప్పను సెక్యులర్ గాడ్ అనడం ఏంటి అని మండిపడ్డారు. నేటి బంద్ హిందువుల మనోభావాలకు ప్రతీక అని, బంద్‌కు తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నానన్నారు పరిపూర్ణానంద. బంద్‌లో పాల్గొని హిందువులు మనోభవాలు తెలియజేయాలని పిలుపునిచ్చారు.