బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (16:21 IST)

కుమార్తె చేతి నరాలను బ్లేడుతో కోసి... సూసైడ్ చేసుకున్న దంపతులు

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఓ దంపతులు కిరాతక చర్యకు పాల్పడ్డారు. తమ రెండున్నరేళ్ళ కుమార్తె చేతి నరాలను బ్లేడుతో కోసి ఆ పై తాము కూడా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
కడలూరు జిల్లా దిట్టకుడి సమీపంలోని ఇడైసెరువాయ్‌ కాలనీకి చెందిన మరుదముత్తు (30), ఉషా దంపతులకు రెండున్నరేళ్ల ప్రత్యుష అనే కుమార్తె ఉంది. ఉపాధి నిమిత్తం మరుదముత్తు కుటుంబం రాజ్‌కోట్‌లో నివశిస్తోంది. ఈ క్రమంలో, కొన్ని నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. 
 
ఈ క్రమంలో ఉదయం ఎంతసేపటికీ వీరు బయటకు రాకపోవడంతో అనుమానించిన బంధువులు కిటికీలో నుంచి లోపలికి చూడగా, మరుద ముత్తు ఉరేసుకొని, అతని పక్కనే ఉషా, కుమార్తె అచేతంగా పడివుండటం గుర్తించి దిగ్భ్రాంతిగురై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా కూతురి చేతిని బ్లేడుతో కోసి హత్యచేసిన అనంతరం భార్యాభర్తలిరువురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటాన్ని గమనించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, వీరి ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేపట్టారు.