శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 13 జూన్ 2019 (19:55 IST)

గుట్కాతో తిరుమలకు తమిళ తంబీలు... వద్దంటే వాదన... చితకబాదారు...

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తులకు, సెక్యూరిటీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టుకు చెందిన 45 మంది భక్త బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద లగేజ్ చెక్ చేస్తుండగా నారాయణస్వామి అనే భక్తుడు గుట్కా ప్యాకెట్‌ను చేతిలో పట్టుకున్నాడు. 
 
సెక్యూరిటీ సిబ్బంది గుట్కా తీసుకెళ్ళకూడదని చెప్పి కిందపడేయమన్నారు. నారాయణ స్వామి గుట్కా ప్యాకెట్‌ను కిందపడేసి లగేజ్‌ను చెక్ చేయించుకుని వెనక్కి వచ్చి మళ్ళీ గుట్కా ప్యాకెట్‌ను ఎత్తుకున్నాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది నారాయణస్వామి చేతిలో ఉన్న గుట్కా  ప్యాకెట్‌ను బలవంతంగా తీసుకున్నారు. అయితే నారాయణస్వామి గుట్కా ప్యాకెట్ ఇవ్వకుండా సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగాడు.
 
దీంతో సెక్యూరిటీ సిబ్బంది, భక్త బృందానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది నాపాయణస్వామిపై దాడి చేశారు. అడ్డొచ్చిన భక్తబృందాన్ని కొట్టారు. నారాయణస్వామిని బలవంతంగా లాక్కెళ్ళి సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు.