Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనంతలో పయ్యావుల కేశవ్ అనుచరులు ఎంత పని చేశారో తెలుసా?

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (12:48 IST)

Widgets Magazine
tdp cadre attak on woman

అనంతపురం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఆగడాలు, అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తమకు ఎదురొస్తే పార్టీలోని చిన్న నేతలపై, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులపై సైతం దాడులకు వెనుకాడటం లేదు. 
 
తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ  ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు వీరంగం సృష్టించారు. సమస్యలపై ప్రశ్నించినందుకు సుధ అనే మహిళపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. కూడేరు మండలం జల్లిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర మహిళపై దాడిచేస్తూ కాళ్లతో తన్నుతూ.. జట్టుపట్టుకుని ఈడ్చిపడేశాడు. వీరంతా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అనుచరులుగా భావిస్తున్నారు. సమస్యపై ప్రశ్నించినందుకే సుధ అనే మహిళను అందరూ చూస్తుండగానే దాడి చేసిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపివేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Woman Anantapur Payyavula Keshav Police Case Tdp Cadre Attack

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమను తిరస్కరించిందనీ.. అందరూ చూస్తుండగానే వైద్య విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు!

కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది. అందరూ చూస్తుండగానే 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ...

news

పరాయి పురుషుడితో మాట్లాడిందని... భార్య చెవులు కోసిన భర్త

ఆప్ఘనిస్థాన్‌లో దారుణం జరిగింది. భార్య పరాయి పురుషుడితో మాట్లాడిందన్న అక్కసుతో ఆమె రెండు ...

news

మాంసం కొంటున్నారా? కనీస శుభ్రత పాటించట్లేదు.. జరజాగ్రత్త..

మాంసం కొంటున్నారా? అయితే జాగ్రత్త పడండి. మాంసం అమ్మకాల్లో చాలామంది నిబంధనలకు విరుద్ధంగా ...

news

హిజ్రాలకు ప్రత్యేక టాయిలెట్లు.. మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్

పురుషులకు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నట్లు హిజ్రాలకు టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంతో ...

Widgets Magazine