శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (11:54 IST)

ప్రజల నాడిని పట్టుకోవడంలో నేతలు విఫలమయ్యారు : జగన్ ఫైర్

నంద్యా ఉప ఎన్నిక ఫలితంపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో నేతలు విఫలమ్యయారని ఆయన వ్యాఖ్యానించారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో.. కొందరు పార్టీ ముఖ్య నేతలతో కలిసి

నంద్యా ఉప ఎన్నిక ఫలితంపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజల నాడిని పట్టుకోవడంలో నేతలు విఫలమ్యయారని ఆయన వ్యాఖ్యానించారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో.. కొందరు పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగన్ ఫలితాన్ని వీక్షిస్తూ, ఓటమికి గల కారణాలపై ఆయన సమీక్షిస్తున్నారు. 
 
ఇదిలావుంటే జగన్ వైఖరిని సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ముందే డిసైడయ్యారని వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. 13 రోజుల జగన్‌ ప్రచారం ప్రజల్లో పెద్దగా మార్పు తీసుకురాలేకపోయిందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ప్రచారం మొత్తం చంద్రబాబును తిట్టడానికే పరిమితం కావడం కూడా నంద్యాలలో వెనుకంజలో ఉండటానికి కారణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
 
నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం చేపట్టారు. ఈ లెక్కింపులో భాగంగా తొలి రౌండ్ నుంచి టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని చూపిస్తూ వచ్చింది. ప్రతి రౌండ్‌లోనూ వేల సంఖ్యలో ఆధిపత్యాన్ని చూంపడంతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి విజయభేరీ మోగించనున్నారు. 
 
ప్రతీ రౌండ్‌లోనూ టీడీపీ సత్తా చాటుతోంది. నిన్నమొన్నటి వరకూ ఎవరూ గెలిచినా ఓ మోస్తరు మెజారిటీ వస్తుందని భావించిన రాజకీయ విశ్లేషకుల అంచనాలు తల్లకిందులయ్యాయి. భారీ మెజార్టీ దిశగా టీడీపీ దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఉన్న ఆధిక్యాన్ని గమనించిన టీడీపీ నేతలు దాదాపు 30 వేల మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.